Sunday, January 31, 2010

Reply to "నేను హిందువుని కానీ పిరికివాడిని"

నా ఈ బ్లాగు క్రింది లింక్ లో ఉన్న బ్లాగుకి జవాబు...  కాని వేరొక బ్లాగుగా పోస్ట్ చేస్తే బాగుంటుందనిపించింది...ఎందుకంటే అతను/ఆమె నా జవాబుని accept చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు

http://maanasasanchara.blogspot.com/2010/01/blog-post_26.html

ఎక్కడో డెన్మార్క్లో కార్టూన్స్ వేస్తే ఇక్కడ గొడవ చేస్తారు, da vinci code సినిమాని ప్రపంచమంతా చూస్తే మన రాష్ట్రం లో మాత్రం నిషేదించారు కాని మన హిందూమతాన్ని కించపరిచే విధంగా పుస్తకం రాస్తే మాత్రం మనం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ఇస్తాం.

కాని లోపం ఎక్కడో లేదు... మనలోనే ఉంది... హిందువులలో ఐకమత్యం లేదు. హిందూమతంలోని లెక్క లేనన్ని కులాలు విభాగాలు దీనికి కారణం. మనలో చాలామంది హిందువు అని చెప్పుకునే కంటే నేను ఫలానా కులం అని చెప్పుకోటానికే ఇష్టపడతారు. కులాన్ని highlight చెయ్యటానికి పేరు పక్కన తోకలొకటి! మనలో మనం కులాల పేరుతో తన్నుకుంటుంటే మరి పక్క మతాలకి మనమంటే చులకన తప్ప ఇంకేంటి? ఈ గొడవలు మన తెలుగు వాళ్ళలో మరీ ఎక్కువ... రాజకీయాల నుండి సినిమావాళ్ళ వరకు...కాలేజీల నుండి ఆఫీసుల వరకు కులాలతో కొట్టుకోవటం తప్ప మనమేం చేస్తున్నాం? ఎవరికి వాళ్ళు గ్రూపులు కట్టటం, వాళ్ళ వాళ్ళతోనే స్నేహం చేయటం! ఉదాహరణకి మన తెలుగు వాళ్ళ orkut profiles చూస్తే ఈ విషయం సులభంగా అర్ధం అవుతుంది. ఎప్పుడూ తమవాళ్ళని పైకి తెచ్చే ప్రయత్నమే తప్ప మన మతం ఐక్యత గురించి ఆలోచించే వాళ్ళే లేరు. పైగా అప్పుడప్పుడు ఇలా హిందూమతాని ఎవరో ఏదో అన్నారని భాధ పడటం ఒకటి! ఒక కులం వాళ్ళు వేరే కులం గురించి నీచంగా మాట్లాడతారు! ఒకరేమో వాళ్ళేదో దేవుడి సంతానమని ఫీల్ అవ్వటం! ఎందుకిలా అంటే మన సౌలభ్యం కోసం దేవుడే ఇలా విభజనలు చేసాడని ఒక వితండవాదం చెయ్యటం. మనలోనే మనమే ఇలా తేడాలు చూపిస్తుంటే హిందూమతమంటే అందరికి చులకన అవ్వక ఇంకేమవుతుంది? నా కులం గొప్ప అంటే వేరొక కులం గొప్పకాదనే అర్ధం!
Divide & Rule ద్వారా మనదేశాన్ని విచ్చిన్నం చేసారని బ్రిటిష్ వాళ్ళని తిట్టిపోయటం తప్ప మనలో మనమే Devide & Live ఆచరిస్తున్నమన్న విషయం పట్టదు. రొజూ నేను పూజించే ఆ ఏడుకొండలవాడిని కరుణానిధి అసలు లేడని చెప్పినప్పుడు నేను పడ్డ బాధ వర్ణనాతీతం, కాని అలాంటి వాళ్ళు ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారంటే మనలోని అనైక్యత ఇచ్చిన ధైర్యమే! ఎప్పుడైతే హిందువులలో అసమానత్వం పోతుందో అప్పటివరకు ఇలా భాదపడుతూ కూర్చోడం తప్ప మనం ఏమీ చెయ్యలేం!ఈ విషయంలో మూలకారకులు ఎవరో కాదు మనమే... మనం చేస్తున్న తప్పల్లా మనలో మనం విభేదాలను ప్రోత్సహించటం,  కపట లౌకికవాదులను మన పాలకులుగా ఎన్నుకోవటం, వారి కుల రాజకీయాలలో పాలుపంచుకోవటం!

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు, చంద్రబాబు ఓటమికి రెండే కారణాలు

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అంటారు,  కానీ చంద్రబాబు ఓటమికి రెండే కారణాలు ఉన్నాయి. ఇది స్వయంకృతమా లేక మితిమీరిన రాజకీయ ఆత్మవిశ్వాసమా? ర...