Saturday, February 20, 2010

కళాతపస్వి

విశ్వనాధ్ గారి సినిమాలంటే నాకు తెలిసింది  శంకరాభరణం నుండి మాత్రమే. కాని అంతకుముందే మంచి చాలా సినిమాలు ఉన్నాయని ఈటీవీ-2 లో విశ్వనాధ్ గారి ప్రోగ్రాం చూస్తేనే తెలిసింది. తెలంగాణా ఉద్యమం & మసాలా ప్రోగ్రామ్స్ మీద మన శాటిలైట్ టీవీలు ఫుల్ ఫోకస్ చేస్తున్న సమయంలో విశ్వనాధ్ గారి జన్మదినం గుర్తుపెట్టుకుని ఒక ప్రోగ్రాం ప్రసారం చేసినందుకు  ఈటీవీ-2 వారికి కృతజ్ఞతలు. అందులోనుండి కొన్ని విశేషాలు. సినిమాలు మంచి కథలు కాదని హీరోల చుట్టూ తిరుగుతున్న సమయంలో విశ్వనాధ్ గారు చేసిన సాహసం మరియు అద్భుతం  'శంకరాభరణం'. మనవాళ్ళు  కూడా ఆ సినిమాను సూపర్ హిట్ చేసి  మంచి అభిరుచి ఉందని నిరూపించారు. విశ్వనాథ్ గారి సినిమాలలో కథకి, సంగీతానికే ప్రాధాన్యం.ఆయన సినిమాలో హీరో అనేకంటే, కేవలం ముఖ్య పాత్రదారులు  మాత్రమే ఉంటారు! ఆయన సినిమాలన్నీ ఎంతోకొంత సందేశాన్ని ఇస్తాయి. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, సిరివెన్నల లాంటి సినిమాలయితే కళాఖండాలే. స్వాతిముత్యం  కమలహాసన్ నటనకి  పరాకాష్ట. ఇక స్వాతికిరణంలో ప్రధాన పాత్రధారి మమ్ముట్టి ప్రతినాయకుడిగా అద్భుతం! ఎన్నో అద్భుతమైన పాటలు! వేటూరి & (సిరివెన్నెల) సీతారామ శాస్త్రిలాంటి వారిని పరిచయం చేసింది విశ్వనాథ్ గారే!   ఇక మిగతా తెలుగు సినిమాలలో హీరో అంటే సూపర్ మాన్, వీళ్ళు చూపుడు వేలితో ట్రైన్ ని ఆపేస్తారు, కంటి చూపుతో చంపేస్తారు, 10 లారీల జనాన్ని కూడా ఒంటి చేత్తో చిత్తు చేస్తారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వింతలు ఉంటాయి. కాని వీళ్ళంతా నిజజీవితం లో జీరోమాన్ లు!

ఇక్కడ నాకు ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, విశ్వనాథ్ గారికి వచ్చిన అవార్డులు చాలా తక్కువ. 1992 లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ కూడా ఇచ్చారు. కాని వందల కొద్ది దిశాదశలేని సినిమాలు  తీసిన వాళ్లకేమో పద్మభూషన్లు.(కాని వీరు రాజకీయ పలుకుబడితో  పద్మలు తెచ్చుకున్నారని  ఒక ప్రవాదం కూడా ఉంది) ఈ స్టార్స్ సినిమాలలోకి వస్తే, 99% కమర్షియల్ సినిమాలు. పోనీ అందులో మంచి సినిమాలు ఏమన్నాఉన్నాయా అంటే భూతద్దం పెట్టిచూడాల్సిందే!  ఏదైతేనేమివిశ్వనాథ్ గారి చేతి నుండి వచ్చిన కళాఖండాలను  గౌరవిస్తూ ఆయనకి మన తెలుగు సినిమాలో ఒక సముచిత స్థానం ఇస్తే బాగుంటుంది.

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు, చంద్రబాబు ఓటమికి రెండే కారణాలు

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అంటారు,  కానీ చంద్రబాబు ఓటమికి రెండే కారణాలు ఉన్నాయి. ఇది స్వయంకృతమా లేక మితిమీరిన రాజకీయ ఆత్మవిశ్వాసమా? ర...