Sunday, September 18, 2011

గంగపుత్రులు - వంజరం రుచి వెనుక కన్నీళ్లు!

"ఆ పెద్ద చేపని ఎందుకు వండటంలేదు?" పదేళ్ళ మత్స్యకారుల అమ్మాయి తన పిన్నిని అడుగుతుంది. "దాన్ని డబ్బున్నోళ్ళు తింటారు" అని  ఆ అమ్మాయి పిన్ని చెప్తుంది. "ఆ చేపను పట్టింది మనం కదా, మనమెందుకు తినకూడదు?"  అని ఆ అమ్మాయి ధర్మసందేహం! సమాధానం చెప్పలేక ఆ అమ్మాయి పిన్ని మౌనంగా ఉంటుంది. ఆ మౌనం వెనుక వాళ్ళ జీవనోపాధి ఉందని ఆ చిన్ని అమ్మాయికి తెలియదు. ఒకరి రుచి ఇంకొకరి జీవనోపాధి.

ఈ dialogs గంగపుత్రులు సినిమాలోవి. ఈ సినిమా చూసాక, చాలా రోజుల తర్వాత  ఒక మంచి సినిమా చూసాననిపించింది. It was a good attempt to portray ground reality. Though artists' performance is sort of ok, we can ignore it as movie is raw and realistic. మన దేశంలో మనతోపాటు ఉండే కొంతమంది(నిజం చెప్పాలంటే చాలా మంది) ఎంత దుర్భర పరిస్థితులలో బతుకుతున్నారో తెలుస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీసారంటే ఖచ్చితంగా లాభం కోసం కాదు. అసలు దీనిని ఒక సినిమా కోణంలో చూడకూడదు. చెత్త రాజకీయనాయకులు, స్వార్థ వ్యాపారవేత్తల వల్ల,  మత్స్యకారుల జీవితం ఎంత దుర్భరంగా మారిందో తెలియచేసే ప్రయత్నం. రోజూ కంప్యూటర్లో కోడ్ రాసుకుంటూ, ఫేస్ బుక్ లో status updates ఇచ్చుకుంటూ, weekendలో multiplexల్లో సినిమాలు చూస్తూ,  ఇలా అప్పుడప్పుడూ బ్లాగ్ రాసుకుంటూ సుఖమైన జీవితం గడుపుతున్నాం. అప్పుడప్పుడూ ఇలాంటి సినిమాల వల్ల, ground reality కొంచెమైన గుర్తు చేసుకోవచ్చు, అసలు ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు. ఒక్కోసారి మనం ఎంత అదృష్టవంతులమో తెలుస్తుంది. కొంచెం డబ్బు విలువ తెలుస్తుంది. ఇందులో 2 నిమిషాల ఒక చిన్న సీన్ ఉంటుంది. supermarket culture వల్ల ఎంతమంది చిన్న వ్యాపారస్తులు వాళ్ళ షాపులు మూసేయల్సివచ్చిందో అర్ధం అవుతుంది. మనం మర్చిపోయిన ఇలాంటి చాలా విషయాలను  గుర్తుచేస్తుంది. వీలైతే సినిమాని చూడండి!

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు, చంద్రబాబు ఓటమికి రెండే కారణాలు

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అంటారు,  కానీ చంద్రబాబు ఓటమికి రెండే కారణాలు ఉన్నాయి. ఇది స్వయంకృతమా లేక మితిమీరిన రాజకీయ ఆత్మవిశ్వాసమా? ర...